జాతీయ వార్తలు

మరింత ప్రమాదకర స్థాయికి కేంద్ర బడ్జెట్ లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, జనవరి 18: ఇటీవలి ఎన్నిల ఫలితాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల క్రమంలో బడ్జెట్ లోటుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపురైతులకు ధన రూపేణా చెల్లింపులు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలూ పెరుగుతున్నాయి. వరుసగా రెండో సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన క్లిష్టతర చర్యలతో నిర్థిష్ట ప్రణాళికా లక్ష్యాలకు తిలోదకాలిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.5 శాతం తేడా వచ్చే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్టెట్ అంచనాలను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇంకా నెల రోజుల ముందునుంచే రాబోయే బడ్జెట్‌పై, ప్రధానంగా ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలపై సర్వత్రా చర్చ మొదలైంది. ప్రధాన లక్ష్యాలకు ఈ సంవత్సరం సైతం నీళ్లొదిలే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికలు సవాలుగా మారిన క్రమంలో జనాదరణ,ప్రఖ్యాతిపైనే దృష్టి నిలిపిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన పథకాలను వచ్చే బడ్జెట్‌లోప్రకటించే అవకాశం ఉందంటున్నారు.ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతులకు నగదు రూపేణా లబ్థిచేకూర్చే అంశాన్ని, అలాగే పన్ను మినహాయింపులను కల్పించే విషయాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకట్టుకునే విషయాలపైనే వచ్చే బడ్జెట్ అంచనాలు కేంద్రీకృతం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ప్రత్యేకించి ఇటీవలి ఎన్నికల్లో ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ నియంత్రణ కోల్పోవడంతో కేంద్ర దృక్పథంలో మార్పు వచ్చిందంటున్నారు. దీంతో మార్చి నాటికి ముగిసే ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో సుమారు 3.5 శాతం తేడా వచ్చే అవకాశం ఉందని, ఇది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంచనా 3.3 శాతం కన్నా అధికమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చాలన్న ప్రణాళికలు దేశ ఆర్థిక లోటుకు మరిన్ని సవాళ్లు విసిరే అవకాశం ఉందని న్యూయర్క్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు విలియమ్ ఫోస్టర్ అభిప్రాయపడుతున్నారు. ఇందువల్ల సమీప భవిష్యత్తులోప్రభుత్వం తన ఆర్థిక వనరులు పెంచుకునే అవకాశాలు తగ్గుతాయన్నారు. మోదీ ప్రభుత్వం 2017లో దేశాన్ని అరుదైన అభివృద్ధి పథంలో నడిపింది. ప్రత్యేకించి పలు సంస్కరణలకు తెరలేపి పన్ను విధానంలో లోటుపాట్లు, బ్యాంకుల్లో అవినీతిని అరికట్టేందుకు చేపట్టిన చర్యలు దీర్ఘకాలంలో దేశ ఆర్థిక రంగానికి విస్తృత ప్రయోజనాలు చేకూర్చేలా వున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు సైతం కితాబిస్తున్నారు.
బాండ్ల ద్వారా..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వార్షిక ఆర్థిక లోటు లక్ష్యాలను గడచిన అక్టోబర్ నాటికే అధిగమించింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనూ భారీ తగ్గుదల నమోదైంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల ఆస్తుల అమ్మకాలు, డివిడెండ్ చెల్లింపుల ద్వారా సమకూరిన ఆదాయ వివరాలు అందాల్సివుంది. కాగా మదుపర్లు ఇప్పటికే బలహీన రంగాల్లోని పెట్టుబడుల అమ్మకాలకు పాల్పడుతున్నారు. వచ్చే పదేళ్ల కాలానికి లబ్ధిచేకూర్చే ఆర్థిక అంశాలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన కారణం రూపాయి విలువ తగ్గడమేనని అంటున్నారు. ఇలావుండగా ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు నగదు లబ్థిచేకూర్చే పథకం అమలులోకి రాకపోచ్చని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణురాలు అభిప్రాయపడ్డారు. ప్రాథమిక అంచనాల దృష్ట్యా ఈ పథకానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చువుతుందని తెలుస్తోంది. ఇది దేశ జీడీపీలో 1.2 శాతం. ఒక వేళ రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం అయితే ఆర్థిక భారం కొంత తగ్గవచ్చు. ఇలాంటి నగదు బదిలీ పథకం వల్ల ప్రస్తుతం ఉన్న ఆహారం, ఎరువులు వంటి ప్రధాన సబ్సిడీలకు విఘాతం కలగవచ్చని అంటున్నారు. కాగా రైతుల నగదు బదిలీ పథకంలో రాష్ట్రాలనూ భాగస్వాములను చేస్తే అదనంగా మరో లక్ష కోట్ల ఆర్థిక భారం పెరుగుతుందని, అందువల్ల వార్షిక ఆర్థిక లోటు 3.5 శాతానికి మించుతుందని మరికొంత మంది నిపుణులు అంచనావేస్తున్నారు.
చిన్న తరహా పొదుపు పథకాలతో లబ్థి
ప్రభుత్వ చిన్నతరహా పొదుపథకాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రత్యేకించి దేశానికి అదనపు ఆదాయాన్ని చేకూర్చే విషయంలోప్రస్తుతం ఇనె్వస్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆపద్బాంధవుడి గా రిజర్వు బ్యాంకు వ్యవహరించే అవకాశాలున్నాయని నిపుణలు చెబుతున్నారు. ఆ బ్యాంకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.