జాతీయ వార్తలు

అయిదేళ్లలో 22వేల కోట్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 1:ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆయిదేళ్లలో రూ.22,112 కోట్లు నిధుల లభ్ధి చేకూరనుందని కేంద్రమంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయంపై రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు ఇందర్‌జిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మార్చి 31 నాటికి మొత్తం రూ.6,403 కోట్ల విడదల చేసినట్లు పేర్కొన్నారు. చట్టంలోని వివిధ హామీల మేరకు ఈ నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రధానంగా విభజన తర్వత ఏపీకి ఆర్థికలోటు పుడ్చడానికి రూ.2,803 కోట్లు, వెనకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు రూ.700 కోట్లు, ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి రూ.2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు రూ.850 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. కేంద్రం వద్దనున్న ఆర్థిక వనరులు, ఏపీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పటివరకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి గతంలో కంటే వచ్చే అయిదేళ్లకాలంలో రూ.22,112 కోట్ల నిధులు లబ్ధి చేకూరుతుందని జవాబిచ్చారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఏపీ పదేపదే కేంద్రాన్ని కోరుతోందన్నారు. అలాగే కృష్ణా పుష్కరాల నిర్వహణకు కేంద్రం నిధులు మద్దతు నివ్వాలని కోరిందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ప్యాకేజి ఇవ్వాలనేది విభజన చట్టంలో చెప్పలేదని ఆయన అన్నారు.