అంతర్జాతీయం

వరుసగా పదో ఏడాది చీకటైన సిడ్నీ నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 19: వాతావరణ మార్పుపై కార్యాచరణకు పిలుపులో భాగంగా గంటసేపు దీపాలను ఆర్పేయాలన్న ఎర్త్ అవర్ పిలుపునకు స్పందిస్తూ శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జి ప్రాంతాలతో పాటుగా నగరమంతా కూడా చీకటిగా మారిపోయింది. పదేళ్ల క్రితం అంటే 2007లో సిడ్నీ నగరంనుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు 176 దేశాలకు విస్తరించినందుకు నిర్వాహకులు ఎంతో సంతోషిస్తున్నారు. ఢిల్లీలోని రాష్టప్రతి భవనం, పార్లమెంటు భవనం, పారిస్‌లోని ఈఫిల్ టవర్, తైపీ 101, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉండే చారిత్రక కట్టడాలు, భవనాలు శనివారం రాత్రి 8.30 గంటలనుంచి గంటసేపు చీకటిగా మారిపోయాయి. ఒక నగరంనుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు 178 దేశాలకు, 7 వేలకు పైగా నగరాలకు, వందలాది కోట్ల ప్రజలకు విస్తరించినందుకు నిర్వాహకులు ఎంతో సంతోషిస్తున్నారని ఎర్త్‌అవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ దాస్ అన్నారు. గంటసేపు విద్యుత్ దీపాలు ఆర్పడం వల్ల ఎంత విద్యుత్ ఆదా అవుతుందో నిర్వాహకులు ఎప్పుడూ లెక్క వేయలేదు. ఎందుకంటే ఒక అంతర్జాతీయ సమస్యకు సంఘీభావం తెలియజేయడానికి గుర్తుగా మాత్రమే వారు దీన్ని చూస్తున్నారు.