జాతీయ వార్తలు

దుస్తుల పరిమాణంలో ప్రామాణికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 20: దేశ ప్రజల ఆకృతికి తగినట్లుగా దుస్తుల సైజులు తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. గుజరాత్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఆదివారం ఆమె పాల్గొని జౌళి రంగంలో సాధించిన ప్రగతిపై వివరించారు. దుస్తుల సైజుల్లో ప్రామాణికత పాటించడం పెద్ద సవాలేనని, భారతీయలకోసం ప్రత్యేక సైజుల్లో దుస్తులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, యూరప్ దేశాలవారికి తగిన విధంగా మార్కెట్లో దుస్తుల సైజులున్నాయి.. అయితే మనవారికి తగినట్లుగా సైజులు లేవు. అందుకే ‘సైజ్ ఇండియా’ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఔళి రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు రూ.1800 కోట్లు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో విడుదల చేశారని, అలాగే ఈరంగంలో దాదాపు 30వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.