జాతీయ వార్తలు

పడవ బోల్తా.. 8మంది జలసమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 21: కర్నాటకలో సోమవారం ఓ పడవ బోల్తాపడ్డ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడని, 17మందిని రక్షించామని నౌకాదళ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోని కురుమగూడ ద్వీపంలో జరిగిన నరసింహస్వామి వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వీరు వెళ్లారని, దర్శనం అనంతరం పడవలో తిరిగి వస్తూండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. మొత్తం వెయ్యి మంది కురుమగడ్డ ద్వీపానికి వెళ్లారని, వీరిలో 26మంది తిరిగి కన్వర్ రేవుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నౌకాదళం, తీరప్రాంత రక్షక దళాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయని, 17మందిని రక్షించి ఒడ్డుకు చేర్చగలిగామని నౌకాదళం తెలిపింది. గల్లంతైన మరో యాత్రికుడి కోసం కూడా గాలింపు చేపట్టామని, ఎనిమిది మంది మృత దేహాలను వెలికి తీయగలిగామని తెలిపారు. సహాయ చర్యల నిమిత్తం గోవా నుంచి డోర్నియర్ విమానాన్ని రంగంలోకి దింపినట్టు నేవీ వెల్లడించింది.

కర్నాటకలో పడవ మునిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న నౌకాదళ సిబ్బంది