జాతీయ వార్తలు

పురుషోత్తపట్నం పోలవరంలో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని జమ్ముల చౌదరయ్య, ఐఎస్‌ఎన్ రాజు ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. చెన్నై ఎన్జీటీ బెంచ్‌లో ఈ పిటిషన్లు దాఖలు కాగా, సోమవారం ఎన్జీటీ చైర్మన్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టు పొలవరంలో భాగమేనని, అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వ తీసుకోలేదని కేంద్రం నివేదిక ఇచ్చింది. దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇది పోలవరం ప్రాజెక్టులో భాగం కాదని.. అనుమతులు అవసరమని వాదించారు. ఈ సమయంలో బెంచ్ జోక్యం చేసుకోని.. అసలు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్నది నిర్ధారించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంపై తదుపరి చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ పర్యావరణ అటవీ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది.