జాతీయ వార్తలు

మమత సమర్థురాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 21: ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలతో జనం విసిగిపోయారని సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ప్రశంసలు కురిపించారు. మమత మంచి పరిపాల దక్షతగల నాయకురాలని స్వామి చెప్పారు. కేంద్రంలో పగ్గాలు చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ, సమర్థత మమతకు ఉన్నాయని కుమారస్వామి పేర్కొన్నారు. ఎవరు నాయకత్వం వహించాలన్న విషయం ఇప్పుడు అప్రస్తుతమని, బీజేపీ వైఫల్యాను ఎండగట్టడమే ప్రతిపక్షాల ముందున్న అంశమని జేడీఎస్ నేత తెలిపారు.‘ఎన్నికల్లో గెలవడమే ప్రధానం. ఆ తరువాతే నాయకత్వం అంశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’అని ఆయన చెప్పారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. చాలా రాష్ట్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయని స్వామి పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలకు సుపరిపాలన అందుతుందని కర్నాటక సీఎం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తరువాత నాయకుడ్ని ఎంపిక చేసుకుంటామని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి హాజరైన కుమారస్వామి ఓ వార్తా సంస్థకు ఇంటర్‌వ్యూ ఇచ్చారు.‘దేశాన్ని నడిపించగల సత్తా తృణమూల్ అధినేత్రి మాయావతికి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమత ఎంతో సమర్థవంతగా పనిచేస్తున్నారు’అని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతా ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరైన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా‘ ఎన్నికల తరువాత ప్రతి ఒక్కరూ వచ్చి చేరతారు. ఈవిషయంలో నేను ఆశావాదిని. మహాకూటమి మరింత బలోపేతం అవుతుంది’అని జేడీఎస్ నేత పేర్కొన్నారు.