జాతీయ వార్తలు

పరమపదించిన శివకుమార స్వామీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 21: ‘నడిచే దేవుడు’గా అన్ని వర్గాల ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలిచే శ్రీ సిద్ధగంగ మఠం స్వామిజీ శివకుమార స్వామి పరమపదించారు. గత రెండు వారాలు అనారోగ్యంతో బాధపడుతున్న 111 సంవత్సరాల ఈ స్వామి మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. కోట్లాది మంది కొలిచే శివకుమార స్వామి గౌరవార్థం మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప స్వామిజీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ ట్వీట్‌లో సంతాపం ప్రకటించారు. ప్రజల కోసం ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల కోసం స్వామిజీ పాటుపడ్డారని, సామాజిక రుగ్మతలపై పోరు తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ అన్నారు. పద్మభూషణ్ అవార్డు పొందిన స్వామిజీకి భారతరత్న పురస్కారాన్ని అందించాలని సంయుక్తంగా మీడియా ముందు మాట్లాడిన కుమారస్వామి, యెడ్యూరప్పలు కేంద్రాన్ని కోరారు. శ్రీ సిద్ధగంగ సొసైటీ ద్వారా వేలాది మందికి ఆయన చదువును అందుబాటులోకి తెచ్చారు.
శివకుమార స్వామీజీతో ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)