జాతీయ వార్తలు

ప్రధాని మోదీకి ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జనవరి 21: ప్రతి పక్షాల మహాకూటమి ఐక్యతపై ప్రధాని నరేంద్రమోదీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. కోల్‌కతాలో ఇటీవల జరిగిన ర్యాలీపై ఆయన చేసిన విమర్శలు, భావోద్వేగాన్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. తన ప్రతి ప్రసంగంలోనూ విపక్షాల మహాకూటమి గురించే మోదీ మాట్లాడుతున్నారని, ఆయన మనసులో భయం పట్టుకుందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదని అహ్మద్‌పటేల్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో మోదీ మాటల్లోనూ, హావభావాల్లోనూ ఈ భయం ద్యోతకమవుతుందని అహ్మద్‌పటేల్ అన్నారు. సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తథ్యమని స్పష్టం చేశారు. రైతుల నుంచి మైనార్టీల వరకు సమాజంలోని అన్ని వర్గాలు మోదీ పాలనతో విసుగెత్తిపోయాయని అహ్మద్ పటేల్ తెలిపారు. అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఈ నాలుగేళ్లలో ప్రబలం అయ్యాయని ఆరోపించిన అహ్మద్ పటేల్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై కూడా విరుచుకుపడ్డారు. యాభై ఏళ్ల పాటు ఇక దేశంలో బీజేపీదే అధికారం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అహ్మద్ పటేల్ ‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే రెండు వందల సంవత్సరాల పాటు ఆ పార్టీ అధికారంలోకే రాదు’ అన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దేశానికి ఏం చేయలేకపోయారు కాబట్టే బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.