జాతీయ వార్తలు

‘వంశధార’ సాంకేతిక సమస్యలను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్ 2017లో ఇచ్చిన తీర్పుపై ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాల విచారణను ట్రిబ్యునల్ మార్చికి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై వివరణ కోరుతూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ముకుందకామ్ శర్మ నేతృత్వంలోని ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది. ఒడిశా అభ్యంతరాలపై ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన కౌంటర్లును కూడా ట్రిబ్యునల్ ధ్రువీకరించింది. అలాగే వంశధార వరద కాలువ సైడ్ వియర్ నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలను ట్రిబ్యునల్ గత ఏడాది డిసెంబర్ నెలలో పరిశీలించింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలకు అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే పలు సాంకేతిక అభ్యంతరాలను ఒడిశా వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల సమాధానాలు ఒడిశాకు అందజేశారు. అభ్యంతరాలపై
రెండు రాష్ట్రాల అధికారులు జనవరి 28న సమావేశమై పరిష్కార మార్గాలను కనుగొని వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. విచారణకు సంబంధించి వాదనల తేదీలను ఖరారు చేసింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒడిశా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 5, 6, ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో విచారణ చేపడతామని జస్టిస్ ముంకుందకామ్ శర్మ చైర్మన్‌గా ఉన్న ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తరపున న్యాయవాదులు వైధ్యనాధన్, గుంటూరు ప్రభాకర్, రాజగోపాలరావు, ఒడిశా తరపున మోహన్ కరారి, ఆర్.ఎస్.జెనా విచారణకు హజరయ్యారు.