జాతీయ వార్తలు

బాల్యానికి జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన 26 మంది పిల్లలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో పర్యావరణం కోసం కృషి చేసిన ఆరేళ్ల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. బాల్‌శక్తి పురస్కార్, బాల్‌కళ్యాణ్ పురస్కార్ అనే కేటగిరీల్లో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. వినూత్న ఆవిష్కరణలు, మేధస్సు, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, సాహసానికి సంబంధించి బాల్‌శక్తి పురస్కారాలను అందించారు. అలాగే బాల్‌కళ్యాణ్ పురస్కార్ కింద వ్యక్తులకు, సంస్థలకు, పిల్లల సంక్షేమ రంగంలో కృషికిగాను అవార్డులను ప్రదానం చేశారు. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి మహమ్మద్ సుహైల్, అరుణిమా సేన్, అశ్వంత్ సూర్యనారాయణన్‌లకు బాల్‌శక్తి పురస్కారాలు లభించాయి. సామాజిక సేవ రంగానికి సంబంధించి లకోటియా, ప్రత్యక్ష, ఈహాదీక్షిత్‌లకు పురస్కారాలు లభించాయి. కళలు, సంస్కృతికి సంబంధించి రామ్‌దేవ్ దుష్యంత్ కుమార్, వినయాక, అగర్వాల్, తృప్తిరాజ్ పాండ్య పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో ప్రియమ్, అనీష్, విజయ్, దేవ్‌కులేలు అవార్డులు పొందారు. కార్తీక్ కుమార్, ఆద్రితా గోయెల్, లిఖిల్ దయానంద్‌లు సాహస అవార్డులు అందుకున్నారు. వ్యక్తిగత అవార్డుల్లో ప్రశంసాపత్రంతోపాటు లక్ష రూపాయల నగదు కూడా అందించారు. అలాగే, సంస్థలకు ఇచ్చిన అవార్డుల్లో 5 లక్షల రూపాయల నగదు, ఒక పతకం, ప్రశంసాపత్రం ఉన్నాయి.

చిత్రాలు.. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన బాలలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం జాతీయ అవార్డులు అందుకుంటున్న దృశ్యం