జాతీయ వార్తలు

వారిలో ప్రధాని పదవికి తొమ్మిది మంది పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్డా, జనవరి 22: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం ఇక్కడ నిప్పులు చెరిగారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ నుంచి అమిత్‌షా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహాకూటమి పేరుతో ప్రతిపక్షాల చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎద్దేవా చేశారు. ‘ప్రతిపక్ష పార్టీల్లో 9 మంది ప్రధాన మంత్రి పదవి కోసం కాచుకుకూర్చున్నారు’అని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. ‘20-25 మంది నాయకులు చేతులు కలిపినా నరేంద్రమోదీకి ఏమీ కాదు. మళ్లీ ప్రధాని మోదీనే’అని అమిత్‌షా వెల్లడించారు.కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన ర్యాలీలో 23 పార్టీల అధినేతలు పాల్గొన్నారు.‘మమతా ర్యాలీకి హాజరైన నేతల్లో 9 మంది ప్రధాని అభ్యర్థులే’అంటూ బీజేపీ చీఫ్ విమర్శించారు. ఏ పార్టీ నాయకుడి పేరునూ ప్రస్తావించని షా‘మాకు ఉన్నది ఒకే ఒక ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ. ఆయనే మళ్లీ ప్రధాని’అని స్పష్టం చేశారు. ‘గణతంత్ర బచావో యాత్ర’ పేరుతో బీజేపీ అధినేత అమిత్‌షా బెంగాల్ నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు మమత మద్దతు ఇస్తున్నట్టా? లేనట్టా చెప్పాలని షా డిమాండ్ చేశారు. బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. మమత ప్రభుత్వంలో హత్యలు పెరిగిపోయాయని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వ ఉండాలన్నదే ప్రతిపక్షాల కోరిక అని ఆయన విమర్శించారు. బలహీన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగుతాయని, అవినీతిని పెంచేయొచ్చని ఆశిస్తున్నారని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటించడానికి బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వరు, హెలికాప్టర్లు దిగడానికి స్థలం నిరాకరిస్తారని ఆయన ధ్వజమెత్తారు.