జాతీయ వార్తలు

యూపీ తూర్పు విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలచినదే జరిగినదీ
పోలికలిందరవిగాగ పోడిమితోడన్
గెలుపును కాంగ్రెస్‌కీయగ
ఆలనపాలన ప్రియాంక అందలమెక్కెన్
*
న్యూడిల్లీ, జనవరి 23: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వద్రా ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాలోకి అరంగేట్రం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వంటి మిత్రపక్షాలు సైతం తమను పక్కన పట్టడంతో భయపడిపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావటంతోపాటు, దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు భాగానికి ఆమెను ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. లోక్‌సభ ఎన్నికలకు కేవలం తొంబై రోజుల ముందు ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించటం చర్చనీయాంశమైంది. రాహుల్ ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఒక ప్రకటన జారీ చేశారు. ఉత్తర యూపీ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌ను హర్యానా ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తూర్పు ఉత్తర ప్రదేశ్‌కు ప్రియాంకా గాంధీని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు జ్యోతిరాధిత్య సింధియాను ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కేరళకు చెందిన లోక్‌సభ సభ్యుడు వేణుగోపాల్‌కు ఇచ్చారు.
ఆయన కర్నాటకతోపాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు సగ భాగానికి ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంక ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి తమ బాధ్యతలు చేపడతారు. ఆమె ఇంత వరకు ప్రత్యక్ష రాజకీయాలు నిర్వహించకపోయినా, చాలా కాలం నుండి ఆమె సోదరుడు రాహుల్ లోక్‌సభ నియోజకవర్గం అమేథీ, తన తల్లి సోనియా గాంధీ లోక్‌సభ నియోజకవర్గం రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గం బాధ్యతలు నిర్వహించటం అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాలు నిర్వహిస్తూ రాహుల్‌కు
చేదోడువాదోడుగా ఉంటారు.
లోక్‌సభకు పోటీ!
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపడుతున్న ప్రియాంక ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోసోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా అనారోగ్యం మూలంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునన్న ఊహాగానాలు చాలా కాలం నుంచి ఉన్న విషయం తెలిసిందే. సోనియా స్థానంలో పోటీ చేసేందుకే ప్రియాంకను ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారని అంటున్నారు. బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలు రాహుల్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్దపడటం లేదు. సోనియా ఈ పరిణామాలన్నింటిని లోతుగా పరిశీలించిన తరువాతనే ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాలలోకి తెచ్చారని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ గాంధీ వైఫల్యం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవుతున్నారు కాబట్టే ప్రియాంకా గాంధీని రాజకీయాలలోకి తెస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. సంబిత్ పాత్రా బుధవారం ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించటంపై వ్యాఖ్యానిస్తూ కుటుంబ పాలనకు ఇది పరాకాష్టఅని దుయ్యబట్టారు. ఇది జాతీయ కాంగ్రెస్ కాదు, గాంధీ కుటుంబ పార్టీ అందుకే ప్రియాంకా గాంధీకి పట్ట్భాషేకం చేయించారంటూ ఆయన వ్యంగ్య బాణాలు వేశారు. రాహుల్ గాంధీ వైఫల్యం చెందారనేందుకు ప్రియాంకా గాంధీ నియామకం ప్రబల నిదర్శనమని పాత్రా చెప్పారు. మహా కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను చేర్చుకునేందుకు ఆయా మిత్రపక్షాలు తిరస్కరించటంతో ఏకాకిగా మారిన రాహుల్ గాంధీ చివరకు ప్రియాంకా గాంధీని తెచ్చుకోకతప్పలేదన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు సైతం రాహుల్ గాంధీని తిరస్కరిస్తున్నాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది, ఇప్పుడు బిహార్‌లో కూడా మిత్ర పక్షాల నుండి కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని సంబిత్ పాత్ర చెప్పారు. భారత దేశంలో నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఆయన తరువాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తరువాత రాహుల్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ తరువాత ప్రియాంకా గాంధీ పదవులు చేపడుతున్నారు, అదంతా ఒక కుటుంబ వ్యవహారమని ఆయన దుయ్యబట్టారు. బీజేపీలో ఇలా జరగదు, పార్టీ ఒక కుటుంబంగా పని చేస్తుంది, అక్కడ కుటుంబం ఒక పార్టీగా పని చేస్తుందని పాత్ర విమర్శలు గుప్పించారు. ప్రియాంకా గాంధీని ప్రధాన కార్యదర్శిగా నియమించటం ద్వారా రాహుల్ గాంధీ వైఫల్యాన్ని కాంగ్రెస్ అంగీకరించిందని సంబిత్ పాత్ర చెప్పారు.