జాతీయ వార్తలు

ఇబిసి కోటా ఆర్డినెన్స్‌ను కొట్టివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 4: పటేళ్లకు రిజర్వేషన్ల విషయంలో గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడినవారికి (ఇబిసిలకు) పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. రిజర్వేషన్లకోసం ఆందోళనకు దిగిన పటేళ్లను శాంతపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మే ఒకటిన జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ అనుచితమైనదని, రాజ్యాంగ వ్యతిరేకమైనదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.సుభాశ్ రెడ్డి, న్యాయమూర్తి వి.ఎం.పంచోలితో కూడిన హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని కూడా ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించిందని ధర్మాసనం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు హైకోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మార్గం సుగమం అయింది.