జాతీయ వార్తలు

ప్రియాంక నియామకాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 23: కాంగ్రెస్ పార్టీ యూపీ తూర్పు ప్రాంతం ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జీగా ప్రియాంక గాంధీని నియమించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ నియామకం చూస్తే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లుగా సంకేతాలు వస్తున్నట్లు అర్థమవుతోందని బీజేపీ నేత, యూపీ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ చెప్పారు. రాహుల్ గాంధీపై ఆధారపడి రాజకీయాలు చేయలేమనే విషయాన్ని ఆ పార్టీ గ్రహించినట్లుందన్నారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాగాంధీని నియమించడం అంటే రాహుల్ గాంధీకి ప్రాధాన్యత తగ్గినట్లే అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోనే అమేథీ, రాయబరేలి నియోజకవర్గాలు ఉన్నాయి. గాంధీ కుటుంబం నుంచి ఒక్కొక్కరిని ప్రజా పరీక్షకు పంపుతున్నారని, కాని వారు విఫలమవుతున్నారన్నారు. కాగా ప్రియాంకగాంధీ కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తికనపరచడం పట్ల రాహుల్ గాంధీ స్వాగతించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సేవలను ఇక్కడ ఉపయోగించుకుంటామన్నారు.