జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేయడంపై, ఈ వ్యవహారంలో గవర్నర్లు నిర్వహించిన పాత్రపై గురువారం రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజ్యాంగంలోని 356వ అధికరణను దుర్వినియోగం చేయటం ద్వారా సుమారు వందసార్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బిజెపి ఎదురు దాడికి దిగింది. సహకార సమాఖ్య విధానం గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. ‘ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రభుత్వాల మార్పుకు దారితీసిన పరిణామాలు, గవర్నర్ల పాత్ర’ అనే అంశంపై సభలో జరిగిన చర్చ సందర్భంగా రెండు పక్షాల మధ్య ఈ వాగ్యుద్ధం జరిగింది. సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు ఆనంద్ శర్మ చర్చను ప్రారంభిస్తూ ఈ రెండు రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు రాజ్యాంగాన్ని ఘోరంగా ఉల్లంఘించడమేనని విమర్శించారు. నిరుడు చివరలో అరుణాచల్‌ప్రదేశ్‌లో, ఈ సంవత్సరం జనవరిలో ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయని, సుప్రీంకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టుల నుంచి అభిశంసను ఎదుర్కొన్నాయని ఆయన అన్నారు. ఈ రెండు రాష్ట్రాలలో గవర్నర్లు నిర్వహించిన పాత్రను ఆయన ప్రశ్నించారు. గవర్నర్లు ప్రభుత్వ రోజువారీ పాలనలో జోక్యం చేసుకోరాదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని ఆయన అన్నారు.
ఈ రెండు రాష్ట్రాలలో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ పాపిష్టి అజెండాను అమలు చేయడంలో ఉద్దేశపూర్వకంగానే పనిముట్లుగా మారారని ఆయన దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఉత్తరాఖండ్ గవర్నర్‌పై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆ గవర్నర్‌ను కొనసాగించడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొంటూ వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించాలని శర్మ డిమాండ్ చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు చర్చలో జోక్యం చేసుకుంటూ ‘ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎదురుదాడికి దిగారు. వెంకయ్య వ్యాఖ్యలకు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మంత్రి వ్యాఖ్యలు ‘అమర్యాదకర (అన్‌పార్లమెంటరీ) భాష’ పరిధిలోకి వస్తాయో, రావో పరిశీలిస్తానని డిప్యూటి చైర్మన్ పి.జె.కురియన్ అన్నారు. 356వ అధికరణను 90 నుంచి వందసార్లు దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ అంశాన్ని లేవనెత్తే నైతిక హక్కు లేదని వెంకయ్య అన్నారు.

చిత్రం.. రాజ్యసభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు