జాతీయ వార్తలు

రోశయ్యకు జయ సిఫారసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేక తాజాగా గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆనందీ బెన్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రోశయ్య పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఆయనకు పొడిగింపు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం జయలలిత మోదీని కోరారన్న ప్రచారం తమిళ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రోశయ్య గవర్నర్‌గా వచ్చిన తర్వాత జయలలితతో పరిపాలన పరమైన సహకారం కొనసాగించారు. ఆమె కూడా ఆయనకు గౌరవం ఇచ్చి ముఖ్యమైన అంశాలపై రాజకీయ సలహాలు తీసుకునేవారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న రోశయ్య పదవీకాలం పొడిగించాలని ఆమె ప్రధానిని కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, బిజెపి వర్గాలు మాత్రం తమిళనాడు గవర్నర్ పదవి, ఇటీవల గుజరాత్ సీఎం పదవిని త్యాగం చేసిన ఆనందీబెన్‌ను వరించవచ్చని చెబుతున్నాయి. ఒకవేళ ఆమె కాకున్నా, పార్టీలో చాలామంది సీనియర్లు పదవుల కోసం ఎదురుచూస్తున్నందున, వారిలో ఒకరిని వరించే అవకాశాలున్నాయని విశే్లషిస్తున్నారు.