జాతీయ వార్తలు

ఆగిన ఖాతాల్లో సొమ్ముకు వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: క్రియాత్మకంగా లేని ఖాతాలపై మళ్లీ వడ్డీ చెల్లించాలని ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. దాదాపు 32వేల కోట్ల మేర ఉన్న నిధులపై వడ్డీ చెల్లింపువల్ల 9కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏప్రిల్ 1నుంచే అమలు చేస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వడ్డీ జమ విధానాన్ని యుపిఏ నిలిపివేసిందని, దీనివల్ల ఖాతాదారులకు నష్టం కలిగిందన్నారు. 36నెలల పాటు ఎలాంటి చందా జమకాకపోతే అలాంటి ఖాతాలను నిర్వహణలో లేనట్టుగా పరిగణిస్తారు. ఇపిఎఫ్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణను చేపట్టాలని కూడా నేటి ట్రస్టీల బోర్డు సమావేశంలో నిర్ణయించామని దత్తాత్రేయ తెలిపారు. దీనివల్ల సిబ్బందికి పదోన్నతులు లభించడంతో పాటు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ సౌకర్యం కలుగుతుందన్నారు.