జాతీయ వార్తలు

31న బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్, మార్చి 29:ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంగళవారం అనూహ్య మలుపుతిరిగింది. రెండు రోజుల క్రితం విధించిన రాష్టప్రతి పాలన అమలులో ఉండగానే 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అనర్హతకు గురైన తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది.
అయితే వీరి ఓట్లను విడిగా తీసుకోవాలని, అనర్హత పిటిషన్‌పై తుది తీర్పు వెలువడిన తర్వాతే వీటిని వెల్లడించాలని హైకోర్టు న్యాయమూర్తి యు.సి.్ధ్యనీ తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. బలపరీక్ష సక్రమంగా జరిగేలా అసెంబ్లీకి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని డిజిపిని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ఆంతర్యం రాష్టప్రతి పాలనపై హైకోర్టు స్టే ఇచ్చి హరీశ్ రావత్ సర్కార్‌ను పునరుద్ధరించిందా అన్నది స్పష్టం కావడం లేదు. కాగా, హైకోర్టు తీర్పును డివిజన్ బెంచి ముందు బుధవారం సవాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పాఠంతో కాంగ్రెస్ పార్టీ కూడా డివిజన్ బెంచి ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.
ఈ కేసు తుది తీర్పును బట్టి తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. రాష్టప్రతి పాలన విధించడాన్ని కోర్టులో సవాలు చేసిన హరీశ్ రావత్ తరపున ఆయన వాదించారు. రాష్టప్రతి పాలన అమలులో ఉన్నప్పటికీ అసెంబ్లీలో బలపరీక్ష జరిపే అంశంపై న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్న తమ వాదనను హైకోర్టు అంగీకరించిందని సింఘ్వీ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతాయన్న అనుమానంతో రాష్టప్రతి పాలన విధించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.
కాగా, రాష్టప్రతి పాలనను రద్దు చేయడం అన్నది ఎంత మాత్రం అనుమతించదగ్గది కాదని కేంద్రం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనందున సహేతుక కారణాలతోనే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడం జరిగిందని అన్నారు.