జాతీయ వార్తలు

ధర్మ పోరాట దీక్షకు ఏపీ భవన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష చేపట్టేందుకు ఏపీ భవన్‌లో సర్వం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దాదా పు పనె్నండు గంటల పాటు నిర్వహిం చే ఈ ధర్మ పోరాట దీక్షకు జాతీయ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నట్లు తెలిసింది. మహాకూటమి బల ప్రదర్శనగా మారుతున్న ధర్మ పోరాట దీక్షా కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మం త్రులు, తెలుగుదేశం శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు హాజరు కానున్నారు. ధర్మ పోరాట దీక్షకు ఏపీ నలుమూలల నుండి తెలుగుదేశం కార్యకర్తలతో పాటు, ఇతరులు కూడా వస్తున్నారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడిన ప్రత్యేక రైళ్లు నిన్న విజయవాడ నుండి ప్రారంభం కావటం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ తెలుగు సంఘాల వారు కూడా ధర్మ పోరాట దీక్షకు హాజరుకానున్నారు. ఆదివా రం రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబునాయుడు మొదట ఉదయం ఏడు గంటలకు రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీ కి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ఆ యన నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌కు కూడా నివాళులు అర్పించిన అనంతరం ధర్మ పోరా ట దీక్ష ప్రారంభిస్తారు. చంద్రబాబునాయు డు ఎళ్లుండి మధ్యాహ్నం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఏపీ పునర్ వ్యవస్థీకరణంతో జరిగిన అన్యాయం గురించి వివరిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తుందనేది కూడా రాష్టప్రతి దృష్టికి తెస్తా రు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని ఆయన రాష్ట్రపతి కి అందజేస్తారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీయేతర ప్రతిపక్ష నాయకులతో సమావేశమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు అనుసరించవలసిన వ్యూహంపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అభ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారు. ఆయన తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీతో మరోసారి సమావేశమైనా ఆశ్చర్యపోకూడదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.