జాతీయ వార్తలు

జలంధర్ బిషప్ ఫ్రాంకో ఆగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొట్టాయం (కేరళ), ఫిబ్రవరి 10: ఒక క్రైస్తవ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడు జలంధర్ బిషప్ ఫ్రాంకో ములాక్కి అధికార విధుల నుంచి తప్పుకున్నా, ఇంకా పరిపాలనా వ్యవహారాల్లోనే జోక్యం చేసుకుంటూ పెత్తనం చలాయిస్తున్నారు. ఈ విషయాన్ని రోమన్ కేథలిక్ చర్చికి చెందిన నన్స్ ఆరోపిస్తున్నారు. ఫ్రాంకో పెత్తనాన్ని నిరసిస్తూ అనేక మంది మంది నన్స్ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడైన బిషప్ ఫ్రాం కో జులుం కొనసాగుతోందని, పరిపాలనకు దూరంగా ఉంచినా, ఏదో విధంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని ఆందోళన చేస్తున్న నన్స్ ప్రతినిధి సిస్టర్ అనుపమ చెప్పారు. కాగా ఈ విషయమై జలంధర్ చర్చి తరఫున ఫ్రాంకో పీటర్ కువంపురం మాత్రం అటువంటిదేమీ లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కొట్టాయం జిల్లాలోని కుర్విలింగడ్ కానె్వంట్ నుంచి ఐదుగురు నన్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకునే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న వారిలో కొం త మందిని బదిలీ చేస్తూ జలందర్ చర్చి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. కాని ఈ ప్రచారంలో నిజం లేదని జలంధర్ చర్చి పేర్కొంది. కానె్వంట్ నుంచి తాము బయటకు వెళ్లమని బాధితురాలితో సహా ఐదుగురు నన్స్ ఆమెకు అండగా ఉంటారని చెప్పారు.