జాతీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం ఇసుక పాలసీ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ఇసుక మైనింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానం బాగుందని చత్తీస్‌గఢ్ మైనింగ్ శాఖ ఎండి అధికారిణి రీనా, మహారాష్ట్ర మైనింగ్ శాఖ ఎండి నిరుపమా డాంగే ప్రశంసించారు. తెలంగాణ ఇసుక పాలసీని పరిశీలించేందుకు వచ్చిన వీరు శనివారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి.ఇలంబరితో సమావేశమయ్యారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖ భారీ జరిమానాలు విధించడం, మాఫియాను అరికట్టేందుకు ఇసుక రీచ్‌ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్ మానిటరింగ్ విధానం దేశానికే ఆదర్శమని వారన్నారు. ఈ విధానాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిందిగా నివేదిక ఇస్తామని, సామాన్య ప్రజలకు ఇసుక ఆందుబాటులో ఉండాలనేదే తమ ఆలోచన అని వారు చెప్పారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్, రఫీ ఆహ్మద్, జిఎం ఉదయ్‌రాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు.