జాతీయ వార్తలు

ఏపీకి ఖేదం.. మోదీకి మోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పలు రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ బాధపడుతుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ నీచంగా, అధర్మంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రత్యేక హోదా లభించక మనం బాధ పడుతుంటే, ఆయన మాత్రం సంతోషిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. పార్లమెంటులో బడ్జెట్ సెషన్లలో భాగంగా మిగిలిన రెండురోజుల్లో ప్రత్యేక హోదాను ఇస్తున్నట్లు ప్రకటించాలని, లేని పక్షంలో ఏపీ ప్రజలు బీజేపీని, మోదీనీ శాశ్వతంగా బహిష్కరిస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సోమవారం ఉదయం ఏపీ భవన్‌లో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఒక రోజు ధర్మ పోరాట దీక్ష చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదని ధ్వజమెత్తారు. ధర్మాన్ని పాటించే వ్యక్తే అయితే గుంటూరుకు వచ్చి తనను విమర్శించేవారు కాదని అన్నారు. విభజన గాయంపై మోదీ కారం చల్లి ఆనందిస్తున్నారని, ఆయన ప్రవర్తన ఎంత మాత్రం బాగా లేదని వ్యాఖ్యానించారు. ‘మనం బాధపడుతుంటే ఆయన సంతోషిస్తున్నారు. ఇది పరమ నీచం. పరమ దుర్మార్గం’ అం టూ ప్రధానిని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని ఇతర హామీలను సా ధించేంత వరకూ
తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు నిర్విరామంగా పోరాడతామన్నారు. బీజేపీ సర్కారు తమపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోందని అన్నారు. ‘ఒకవేళ మేము కనె్నర్ర చేస్తే మీరు మసైపోతారు’ అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులుండవన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఎక్కడా ఆదరణ లేదని, హోదా ఇవ్వకపోతే నామరూపాలు కూడా లేకుండా పోతుందని అన్నారు. రాష్ట్రానికి మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేవారు. తాను ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తుంటే మోదీ ఏపీలో పర్యటిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పర్యటించవలసినన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల సమయంలో ధర్మాన్ని విస్మరించి వారే ఇప్పుడు కేంద్రంలో పాలకులుగా ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే, నాటి విపక్ష నేత, నేటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, నాటి ఎంపీ, నేటి ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పదేళ్ల పాటు ఈ హోదా ఉండాల్సిందేనని డిమాండ్ చేశారని అన్నారు. నాడు హోదా కోసం పట్టుబట్టిన వీరంతా ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఖర్చులకు ఏమాత్రం సరిపోటం లేదని, పదహార వేల కోట్ల రూపాయల లోటులో రాష్ట్రం ఉన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ కింద కేవలం 3,900 కోట్ల రూపాయలు ఇచ్చిందని, ఇంత తక్కువ మొత్తం దేనికి సరిపోతుందని ముఖ్యమంత్రి నిలదీశారు. విభజన చట్టంలో ఇచ్చిన 18 హామీలను ఇంకా నేరవేర్చవలసి ఉందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను సైతం వెనక్కు తీసుకునే ఘనత కేంద్రానిదంటూ ఆయన నిప్పులు చెరిగారు. విశాఖలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదని, నిర్మాణానికి నిధులు కూడా ఇవ్వటం లేదని ఆయన దుయ్యబట్టారు. శాసన సభ నియోజకవర్గాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చిన మోదీ మొండి చెయ్యి చూపించారని, ఇరా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే ఈ చలిలోఢిల్లీకి వచ్చామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు