జాతీయ వార్తలు

ఏపీకి హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాన మంత్రి పార్లమెంటులో ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేయకపోవటం సిగ్గు చేటని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఈయన ఎలాంటి ప్రధాన మంత్రి’ అంటూ నిప్పులు చెరిగారు. సోమవారం ఉదయం ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ధర్మ పోరాట దీక్షా శిబిరానికి హాజరైన రాహుల్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రధాన మంత్రి అమలు చేయటం లేదని అన్నారు. ఇంతకంటే దురదృకరమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అని ఆయన నిలదీశారు. ‘మిమ్మల్ని ఓక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భారత ప్రధాన మంత్రి ఈ దేశంలోని ఒకరికి ఒక హామీ ఇస్తే సదరు హామీని అమలు చేయాలా? వద్దా? ఈయన ఎలాంటి ప్రధాన మంత్రి? ఇంతకు ముందు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రత్యేక హోదా స్థాయి కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు, ఈ హామీని ప్రస్తుత ప్రధాన మంత్రి అమలు చేయకపోవటం అన్యాయం కాదా?’ అని అడిగారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలోని భాగం కాదా? ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని అమలు చేయకుండా ఉండే ధైర్యం మోదీకి ఎక్కడిది?’ అంటూ రాహుల్ ప్రశ్నలు కురిపించారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇచ్చే హామీలను ఆ పదవిని చేపట్టే ఇతర ప్రధాన మంత్రులు కూడా పూర్తి చేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఏపీ ప్రజలకు తాను అండగా నిలబడతానని అన్నారు. ‘నేను మీతో ఉన్నాను’ అని ఆయన సభకు హాజరైన వారికి హామీ ఇచ్చారు. మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెబుతారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ఒక అబద్దం చెబితే, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి మరొకటి చెప్తారని విమర్శించారు. మోదీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని చెప్పారు. రెండుమూడు నెలల్లో ప్రతిపక్షాలు దేశం ఏం కోరుకుంటోందనేది మోదీకి చెబుతాయని రాహుల్ వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడుతానని చెప్పి, ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మోదీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడు దొంగ అయ్యాడు). ఏపీ ప్రజల నుండి ముప్పై వేల కోట్లరూపాయలు దోచిన మోదీ దానిని అనీల్ అంబానికి ఇచ్చారు. అది పచ్చి నిజం’ అని రాహుల్ చెప్పాడు. తామంతా కలిసే ఉన్నామని, బీజేపీని, మోదీని ఓడిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు.

చిత్రం.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ