జాతీయ వార్తలు

హోదా కోసం ఆత్మహత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హోదా కోసం శ్రీకాకుళం జిల్లా కింతని ప్రాంతానికి చెందిన దివ్యాంగుడైన దావాల అర్జున్ రావు(40) సోమవారం ఢిల్లీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్న ఆంధ్రాభవన్ ముందున్న జశ్వంత్‌సింగ్ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై వీల్‌చైర్‌లో విగతజీవిగా ఉదయం అర్జున్‌రావు పడివున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్జున్ రావు మృతి చెందడంతో మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడి దగ్గరవున్న వివరాలను సేకరించి అర్జున్ రావుగా గుర్తించారు. అర్జున్‌రావు జేబులో ఒక నోట్ లభించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఎందుకు మృతి చెందాడు అన్న దానిపై అధికారులు తెలియజేసేందుకు నిరాకరించారు.