జాతీయ వార్తలు

ఇక దేశసేవకే ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భార్యగా, తల్లిగా అత్యుత్తమ బాధ్యతలు నిర్వర్తించిన ప్రియాంక గాంధీ దేశ సేవకు అంకితం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి యూపీలో రోడ్‌షోకు ప్రియాంక దిగిన నేపథ్యంలో వాద్రా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ప్రియాంకను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని దేశ ప్రజలను ఉద్దేశించి’ ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రబలంగా ఉన్న సంకుచిత, విషపూరిత రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో అడుకుపెట్టిన ప్రియాంక దేశ ప్రజలకు అత్యుత్తమంగా సేవలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు వాద్రా ఫేస్‌బుక్‌లో ఉద్వేగభరిత వ్యాఖ్యలు పోస్టుచేశారు. ‘దేశ ప్రజలకు సేవచేయాల్సిన బాధ్యత ప్రియాంకపై ఉంది. అందుకే ఆమెను దేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను. ఆమెను కాపాడుకోవాల్సింది మీరే’అని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాద్రాను విచారిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రియాంక గట్టిమద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా జైపూర్‌లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరు కానున్నారు.