జాతీయ వార్తలు

అన్ని సమస్యలకు పరిష్కారం ‘మోదీ’యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరాదాబాద్ (యూపీ), ఫిబ్రవరి 11: దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది ప్రధాని మోదీ ఒక్కరేనని, అన్ని రుగ్మతలకు సర్వరోగ నివారిణి ఆయనేనని, అందుకే ఆయనను వచ్చే ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. మొరాదాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా మోదీ పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, విద్యార్థులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో పాటుపడుతున్నారని అన్నారు.
ఉజ్వల పథకం ద్వారా పేదలకు ఎల్పజీ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సంరక్షణ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారని అన్నారు. కాపలాదారుడు ఎన్నడూ చోరుడు కాదని, కాపలాదారుడు స్వచ్ఛమైన వాడని ఆయన ప్రతిపక్షాల విమర్శలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ఆయనే తిరిగి ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయనే మన సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తని, అందుకే మనం ఆయనను తిరిగి గెలిపించాలని ఆయన కోరారు.
రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఒప్పందం వల్ల మన వైమానిక దళం మరింత పటిష్టం అవుతుందని ఆయన చెప్పరు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఇతర దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు, వత్తిడిని లెక్క చేయకుండా అణు పరీక్షలు ధైర్యంగా నిర్వహించామని, అందుకే భారత్ అణ్వస్త్ర దేశంగా తయారయ్యిందని అన్నారు. యూపీలో ఎస్పీ- బిఎస్పీ పొత్తు గురించి ఆయన ప్రస్తావిస్తూ అది అవినీతి పొత్తు అని వ్యాఖ్యానించారు.