జాతీయ వార్తలు

మన సంస్కృతిలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృందావన్, ఫిబ్రవరి 11: అమ్మ తర్వాత అమ్మ అని పిలిచే గోమాతకు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉందని, అందుకే వాటి ఆరోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నోచర్యలు తీసుకుంటోందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కృష్ణుడు నడయాడిన బృందావన్ చంద్రోదయ మందిరాన్ని తొలిసారిగా దర్శించిన అనంతరం ఆయన గోసేవను సంప్రదాయంగా నిర్వహిస్తున్న మధుర-బృందావన్ ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన తన ప్రసంగం సందర్భంగా ‘గోమాతాకీ జై’ అని నినాదాలు చేశారు. తన 55 నెలల పాలనలో తల్లీ, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ఒక రక్షణ విధానాన్ని తన ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. అయితే మనకు ఇంకోక మాత ఉందని, ఆమెయే గోమాత అని పేర్కొన్న ఆయన గోమాత ఇచ్చే క్షీరానికి బదులుగా మనం ఏమీ ఇవ్వలేమని, అందుకే ఈ గోకుల భూమి నుంచి ఆమెకు వందనాలు సమర్పిస్తున్నానని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాతకు విశిష్టస్థానం ఉందని, రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను ప్రవేశపెట్టి పశువుల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అలాగే గోవుల సంరక్షణకు 500 కోట్ల రూపాయలతో రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాని తెలిపారు. శ్రీకృష్ణుని బాల్యం గడిపిన మధురలోని మందిర ఆవరణలో మాట్లాడిన ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోవుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మూడుకోట్ల మందికి ఆహార సౌకర్యాన్ని కల్పించిన బెంగళూరుకు చెందిన ఎన్జీవో సంస్థ అక్షయపాత్రను ఆయన ప్రశంసలతో ముంచెత్తుతూ వారి సేవా కార్యక్రమాన్ని కృష్ణుడి నడయాడిన నేల నుంచి వీక్షించే అదృష్టం కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మూడు కోట్ల మందికి భోజన సౌకర్యాన్ని అందించిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

చిత్రం.. స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో సరదాగా ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ