జాతీయ వార్తలు
అమిత్‌షా అబద్దాల కోరు: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 February 2019
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో తాను రైట్‌టర్న్ తీసుకొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరుతుంటే, తాను యూటర్న్ తీసుకొన్నానని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. ‘నేను తీసుకున్నది రైట్ టర్న్. పీపుల్స్ టర్న్.. ప్రధాని మోదీ, బీజేపీ తీసుకున్నదే యూటర్న్.. రాంగ్ టర్న్’ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు బహిరంగా లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఏపీకి విభజన హామీల అమలులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.