జాతీయ వార్తలు

చర్చలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ఐదు శాతం ప్రత్యేక కోటా డిమాండ్ చేస్తూ రాజస్థాన్‌లో రైల్‌రోకో చేపట్టిన గుజ్జర్లు ఆందోళన విరమించి చర్చలకు రావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లా ట్ విజ్ఞప్తి చేశారు. తక్షణం రైల్వే ట్రాక్‌లు దిగి ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని సోమవారం ఆ యన పిలుపునిచ్చారు. ‘మీ డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. చర్చలకు రండి’అని సీఎం ఓ అధికార ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో గుజ్జర్ల సమస్యలను చర్చిద్దామన్న గెహ్లాట్ అలాకాని పక్షంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్దాం అని అన్నారు. తమకు 5 శాతం ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ కిరోరి సింగ్ బైన్సాలా నాయకత్వంలో గుజ్జర్లు సవాయ్ మాధోపూర్ వద్ద శుక్రవారం నుంచి రైల్‌రోకో చేపట్టారు. గుజ్జర్లు, రైకా-రెబారీ, గడియా లూహర్, బంజారా, గడారియా సామాజిక వర్గానికి ఉద్యోగాలు, విద్యలో 5 శాతం ప్రత్యేక కోటా ఇవ్వాలని రైలుపట్టాలు ఎక్కారు. అక్కడితో ఆగకుండా ఎన్‌హెచ్ 11పై బైఠాయింపుజరిపారు. రైల్‌రోకో వల్ల 250 సర్వీసులపై ప్రభావం పడింది. కొన్ని రైళ్లు రద్దు, కొన్నింటిని దారిమళ్లించారని సీఎం తెలిపారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా జాతీయ ఆదాయం తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.