జాతీయ వార్తలు

మీరే జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సారధ్యంలోని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ కోరింది. ఏపీ జేఏసీ మంగళవారం రాష్ట్రపతి కోవింద్‌కు కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టలేకపోతే ఎదురయ్యే పరిణామాలకు రాజ్యాంగ అధినేతగా బాధ్యత వహించవలసి వస్తుందని జేఏసీ హెచ్చరించింది. రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని ఏపీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. విభజన అనంతరం ఏపీకి జరుగుతున్న అన్యాయం, హోదాను ఇవ్వవలసిన అవసరం తదితర అంశాలతో
కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని రాష్టప్రతికి అందజేశారు. 3మీరు రాజ్యాంగ పరిరక్షకులు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆయా రాష్ట్రాలకు కల్పించిన సౌకర్యాలు కాపాడటంతోపాటు దేశ ప్రజలను రక్షించవలసిన బాధ్యత కూడా మీపై ఉంది2అని అన్నారు. తొలుత చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఏపీ భవన్ నుంచి జంతర్‌మంతర్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్కడి నుంచి రాష్టప్రతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జేఏసీ చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత తాను చేయగలిగింది చేస్తానని హామీ ఇచ్చారు. శాసన సభ తిరస్కరించినా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్రాన్ని విభజించి తమను సమస్యల సుడిగుండంలో పడవేసిందని చంద్రబాబు సారధ్యంలోని బృందం ఆరోపించింది. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వివిధ రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయని రాష్ట్రపతికి వివరించారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తే ఇంత వరకు జరిగిన నష్టాన్ని కొంత వరకైనా పూడ్చుకునేందుకు వీలుంటుందని వారు చెప్పారు.
3విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయరు. ప్రత్యేక హోదా కల్పించరు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది?2అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే కేంద్రం తరచూ విభజన హామీల అమలును సమీక్షించి లొసుగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని శాసన సభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించట లేదని ఏపీ సీఎం వాపోయారు. రాష్ట్రానికి 2014-15 సంవత్సరానికి రూ. 16,078 కోట్ల లోటు ఉన్నట్టు సీఏజీ ధృవీకరించినా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదని చంద్రమాబు అన్నారు. జనాభా ఆధారంగా పదో షెడ్యూలులోకి ఆస్తులను పంపిణీ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర హోం శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తీర్పుకు భిన్నంగా స్థానికత ఆధారంగా ఆయా ఆస్తులను కేటాయించిందని రాష్టప్రతికి ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని కూడా ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేయటం లేదు, ఇది అత్యంత దారుణమైన విషయమని రాష్ట్రపతికి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. హోదా కోసం తాము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోతే ఎలా అని వారు రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తెచ్చారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను గౌరవించటం లేదని వారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమకు చెల్లించవలసిన విద్యుత్ బకాయిలను కూడా కేంద్రం ఇప్పించటం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంత వరకు రూ . 14, 259.32 కోట్ల రూపాయలు విడుదల చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం రూ. 13,620 కోట్ల రూపాయలకు సంబంధించిన వినియోగ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని రాష్ట్రపతికి చెప్పారు. తాము ఇంత చేసినా కేంద్రం మాత్రం వినియోగ పత్రాలు ఇవ్వటం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఫిర్యాదు చేశారు. వైజాగ్- చెన్నై పారిశ్రామిక కారిడార్, రాపిడ్ రోడ్, రైల్ కనెక్టివిటీ, మెట్రో రైలు నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్, తదితర పలు హామీలు పత్రాలకే పరిమితమయ్యాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా ఇత వరకూ కేంద్రం విభజించలేకపోయిందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరానికి కూడా కేంద్రం నిధులివ్వటం లేదని రామ్‌నాథ్ కోవింద్‌కు తెలిపారు.
చిత్రం..ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ సభ్యులతో కలిసి రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు నాయుడు