జాతీయ వార్తలు

ప్రతీకారం తీర్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జమ్ముకాశ్నీర్‌లోని పుల్‌వామా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి చేసి దాదాపు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై చేసిన దాడిని ఊరికే పోనివ్వమని నరేంద్ర మోదీ తమ ట్వీట్ సందేశంలో స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించిన మోదీ జవాన్ల త్యాగాన్ని వృథాకానివ్వమని హామీ ఇచ్చారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రక్షణ, నిఘా విభాగాల సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం నేర్పిస్తామని రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రధానితో సమావేశం అనంతరం ప్రకటించారు. ఇరువురు మంత్రులు ఈమేరకు ట్విట్టర్ సందేశం పంపించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను శిక్షించి తీరుతామని పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది పిరికిపందల చర్య అని అరుణ్ జైట్లీ విమర్శించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని ప్రశంస్తూ, ఈ కష్టకాలంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని జైట్లీ చెప్పారు. దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు. గతంలో యూరిలో సైనిక శిబిరంపై జరిగిన దాడి కంటే గురువారం జరిగిన దాడి పెద్దమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇలావుంటే, కారు బాంబును ప్రయోగించటం ద్వారా సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని పేల్చివేయటంతోపాటు బైటి నుండి కాల్పులకు పాల్పడిన సంఘటనను ప్రస్తావిస్తూ, దీనికి గట్టి సమాధానం ఇస్తామని హోం శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆయన శుక్రవారం శ్రీనగర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై జరపవలసిన ప్రతిదాడిపై ఒక అభిప్రాయానికి వస్తుందని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై తానే దాడి చేసినట్లు జైషే మహమ్మద్ ప్రకటించిన నేపథ్యంలో, ప్రతిదాడికి ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగిందని భావిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ బహిరంగంగానే ఈ చర్యపై ప్రకటించిన తరువాత కూడా ప్రతీకారం తీర్చుకోకపోతే ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే ప్రభుత్వం వీలున్నంత త్వరలోనే పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటుందని హోం, రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.

చిత్రం.. కాశ్మీర్‌లోని అవంతిపురా వద్ద జరిగిన ఉగ్రదాడిలో మాంసం ముద్దగా మిగిలిన
ఓ జవాన్ భౌతిక కాయాన్ని తరలిస్తున్న దృశ్యం