జాతీయ వార్తలు

అన్నా హజారేకు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మద్‌నగర్: సామాజిక ఉద్య మకారుడు అన్నా హజారే స్వల్ప అస్వస్థతతో గురువారం ఆసుపత్రిలో చేరారు. ఆయన మెదడుకు సరిగ్గా రక్తం సరఫరా కాకపోవడంతో నీరసం రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు డాక్టర్లు తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటు తదితర డిమాండ్లతో అన్నాహజారే గతవారం వారం రోజుల పాటు నిరవధిక నిరశన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు నీరసం, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో గురువారం ఉదయం అహ్మద్‌గర్‌లోని ఆసుపత్రిలో చేరినట్టు డాక్టర్ బాబు కందేకర్ తెలిపారు. తొలుత ఆయనకు ఎంఆర్‌ఐ స్కాన్ చేసిన అనంతరం ఆసుపత్రిలో చేర్చినట్టు ఆయన సహాయకుడు శ్యామ్ ఆశవా తెలిపారు. గత వారం చేసిన దీక్ష వల్ల ఆయన ఐదు కేజీల బరువు తగ్గారని ఆయన చెప్పారు.