జాతీయ వార్తలు

యోగాతోనే రోగాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన జీవన విధానాలు అవలంభించే విధంగా వైద్యులే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైనె్సస్ ఆరో సమావేశాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ , పక్షవాతం వంటి వ్యాధులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక జీవన విధానాల మూలంగా వస్తున్న జబ్బులను ఎదుర్కొనేందుకు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సదస్సులు నిర్వహించేందకు భారత వైద్య విద్యా మండలి సిద్ధం కావాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 63 శాతం మరణాలు వీటివల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినట్టు ఆయన తెలిపారు. ఈ వ్యాధుల నుంచి కాపాడుకొనేందుకు మంచి ఆహారపు అలవాట్లను యువత అలవరుచుకోవాలని చెప్పారు.