జాతీయ వార్తలు

24న పీఎం-కిసాన్ పథకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని మోదీ త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75వేల కోట్ల రూపాయలతో కోటిమంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ రెండు వేల రూపాయలను యూపీలోని గోరఖ్‌పూర్‌లో రైతులకు ఆయన ఈనెల 24న అందజేస్తారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం-కిసాన్) పథకాన్ని ఇటీవల 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా అందజేస్తారు. రెండు హెక్టార్లలోపు పొలం ఉన్న 12 కోట్ల చిన్న, సన్నకారు రైతలకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ గోరఖ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని 24న ప్రారంభిస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల డేటాను పీఎం-కిసాన్ పోర్టల్‌లో 24కల్లా ఉంచుతామని అన్నారు. ఆ రోజే రైతులకు మొదటివిడత మొతా న్ని వారి ఖాతాల్లో జమచేస్తామని, రెండో విడత చెల్లింపును ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తామని వారు తెలిపారు. మొదటి విడత చెల్లింపు లిస్టులో పేర్లు లేనివారికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చరా? అన్న ప్రశ్నకు వారు సమాధానమిస్తూ, సరైన వివరాలు సేకరించకపోవడం, ఇతర సాంకేతిక పరమైన సమస్యల కారణంగా చెల్లింపులు జరగకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన వారికందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందని వారు స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన, ఇతర రైతులకు సైతం ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు తమ పరిధిలోని రైతులకు సంబంధించిన డేటాను పీఎం-కిసాన్ పోర్టల్‌కు గురువారం నుంచి అప్‌లోడ్ చేస్తున్నారని, 12కు పైగా రాష్ట్రాలు 95 శాతం డేటాతో సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన రాష్ట్రాల్లో 80 శాతం డేటా ఉందని వారు తెలియజేశారు. దేశవ్యాప్తంగా రెవెన్యూ శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగానే ఈ పంపిణీ జరుగుతుందని అన్నారు.