జాతీయ వార్తలు

మీ వల్లే దేశానికి చెడ్డపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి దేశాల మధ్య ఒప్పదం ఉండాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
స్థిరాస్తుల సంస్థ ‘క్రెడాయ్’ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. నైతికతతో వ్యాపారాలు చేస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. అనైతిక చర్యల వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం వ్యాపారులకు అంతర్గత స్వీయ నియంత్రణ యంత్రాంగం ఉండాలని ఆయన అన్నారు. ‘దేశ గౌరవ ప్రతిష్టను మంటగలిపిన యోగ్యత లేని వ్యక్తులకు మనకు అక్కర్లేదు. అలాంటి వారి వల్ల అభివృద్ధి గాడితప్పుతుంది’అని వెంకయ్యనాయుడు తెలిపారు. కొందరు పెద్ద మనుషులు దేశాన్ని లూఠీ చేసి, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయారని ఆయన విమర్శించారు. చట్టాలను తప్పించుకోడానికి అలాంటి ఆర్థిక నేరగాళ్లంతా భారత్‌కు వస్తే తమకు ప్రాణహాని ఉందని అంటున్నారని ఉపరాష్టప్రతి మండిపడ్డారు.‘హాని అంటే ఏమిటీ? మీలాంటి వల్లే జాతికి హాని. మీ వల్లే దేశం పరువు, ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి. తప్పు చేయనప్పుడు భయమెందుకు?’అని ఆర్థిక నేరగాళ్లను ఉద్దేశించి అన్నారు. వ్యవస్థల్లో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకోడానికి నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి ఆటోమెటిక్(స్వయంచాలిక) ఒప్పదం దేశాల మధ్య ఉండాలని ఉపరాష్టప్రతి పేర్కొన్నారు. ఏ ఆర్థిక నేరస్తుడి పేరు ప్రస్తావించని ఆయన అలాంటి వారి వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా అప్పగింతకు భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచేసిన నీరవ్‌మోదీ, మెహుల్ ఛోక్సీని రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. విదేశాల్లో దాగిన 12 మంది ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు రప్పించడంతో ప్రభుత్వం విజయవంతమైంది. అగస్టావెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దళారి క్రిస్టియన్ మిచెల్ ఇటీవలే భారత్‌కు రప్పించారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి 50 దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది. మరో పది దేశాలతో ఒప్పందానికి ప్రయత్నిస్తోంది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ఆమోదంలో జాప్యానికి స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలనూ బాధ్యులను చేయాలని ఉపరాష్టప్రతి అన్నారు. ఈ విషయంలో ఒక్క డెవలపర్‌నే బాధ్యుడ్ని చేయడం సరైందికాదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం కూడా ముఖ్యమన్న ఉపరాష్ట్రపతి ‘ ఈ విషయంలో ప్రభుత్వం, పురపాలక సంఘాలూ బాధ్యతను ఎరిగి వ్యవహరించాలి. సకాలంలో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం ద్వారా గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తికావడానికి సహకరించాలి’అని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో రియాల్టీ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వడం ఆయన స్వాగతించారు. బిల్డర్లు డిజిటల్ లావాదేవీలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.