జాతీయ వార్తలు

పర్యావరణ రక్షణ ప్రణాళికల్లో భారత్‌కు మూడో ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: విద్యుత్ వినియోగం, పర్యావరణ పరిరక్షణలో మనదేశం ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంటోంది. ‘లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ, ఎన్విరానె్మంట్ డిజైన్’ (ఎల్‌ఈఈడీ)లో మనదేశం ప్రపంచంలో మూడో ర్యాంకును సాధించింది. దాదాపు 24.81 మిలియన్ చదరపుమీటర్ల విస్తీర్ణంలో 899 ఎల్‌ఈఈడీ సర్టిఫైడ్ ప్రాజెక్టుల ద్వారా భారత్ ఈ ఘనతను సాధించింది. అమెరికాకు చెందిన గ్రీన్‌బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ) ఫర్ ‘లీడ్’ ఎంపిక చేసిన మొత్తం పది దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. 167 దేశాల్లో మొత్తం 96,275 రిజిస్టర్డ్, సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ‘లీడ్’ ప్రపంచంలోనే అత్యధిక వినియోగంలో ఉన్న గ్రీన్ బిల్డింగ్ ప్రోగ్రాంగా గణుతికెక్కింది. గత డిసెంబర్ 31 నాటికి వివిధ దేశాల్లో ‘లీడ్’ సర్టిఫై చేసిన చదరపుమీటర్ల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకుల కేటాయింపుజరిగింది. 2018లో ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్ చదరపుమీటర్ల విస్తీర్ణంలో 7,797 సర్టిఫైడ్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఈజాబితాలో 68.83 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,494 ప్రాజెక్టులతో చైనాప్రథమ స్థానంలో నిలవగా, కెనడా 46.81 చదరపుమీటర్ల విస్తీర్ణంలో 3,254 ప్రాజెక్టులు ద్వారా ద్వితీయ స్థానంలో నిలిచింది. 2018లో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ గ్రీన్ బిల్డింగ్ ఉద్యమంలో అగ్రభాగాన ఉందని, కేవలం వాణిజ్య భవనాలే కాకుండా విద్య, తయారీ, హోటల్ తదితర రంగాల భవనాలను సైతం లీడ్ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో నిర్మిస్తున్నారని గ్రీన్ బిజినెస్ సర్ట్ఫికెట్ ఇన్‌స్టిట్యూట్ (జీబీసీ) అసిస్టెంట్ కమిషనర్, మధ్య, తూర్పు ప్రాంతాల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ గోపాల కృష్ణన్ పద్మనాభన్ తెలిపారు. మనదేశంలోని లీడ్ సర్టిఫైడ్ మెట్రోలు, పట్టణాలను సైతం గ్రీన్ బిల్డింగ్ ఉద్యమంలో భాగస్వామ్యం చేసే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మరింత స్థిరత్వం సాధించేందుకు నివాస గృహాల ప్రాజెక్టులు కూడా కొనే్నళ్లలో ఈ పరిధిలోకి రానున్నాయని, లీడ్ రాష్ట్ర ప్రభుత్వాలు, గృహనిర్మాణ అభివృద్ధి చేసేవారి (డెవలపర్స్)తో అనుసంధానమై పనిచేసే అవకాశాలున్నాయని తెలిపారు. మనదేశంలో పచ్చదనం-పరిశుభ్రతపై మరిన్ని ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కాగా లీడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫైడ్ దేశాల్లో భారత్‌తోబాటు బ్రెజిల్, కొరియా, టర్కీ, జర్మనీ, మెక్సికో, తైవాన్, చైనా, స్పెయిన్ ఉన్నాయి.