జాతీయ వార్తలు

ఏడు ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: భారత్, యూరోపియన్ యూనియన్ ఏడు పరిశోధన, నవీకరణ ప్రాజెక్టులపై సంయుక్తంగా 40 మిలియన్ యూరోల వరకు పెట్టుబడి పెట్టాలని గురువారం నిర్ణయించాయి. దేశంలో నీటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన గంగా రెజువనేషన్ ప్రాజెక్టు కూడా ఇందులో ఉంది. భారత్‌కు వచ్చిన యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజి, బయోటెక్నాలజి డిపార్ట్‌మెంట్లు గురువారం ఈ ఏడు ప్రాజెక్టులను ప్రకటించాయి. ‘ఈయూ-ఇండియా జాయింట్ కాల్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ వాటర్’ కార్యక్రమం కింద ఈ ఏడు ప్రాజెక్టులను ప్రకటించాయి.