జాతీయ వార్తలు

మాది ప్రేమ.. వారిది విద్వేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్మీర్ (రాజస్థాన్): దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడమే పనిగా ఆరెస్సెస్ పనిచేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ సేవాదళ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల్లో పరస్పరం ప్రేమను పంచుకునే విధంగా కాంగ్రెస్‌కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి ద్వేషం విరుద్ధమని, భారతీయ సమాజంలో అసహనానికి తావులేదన్నారు. ఆరెస్సెస్ సమాజంలో అసహనం, ద్వేషాన్ని వ్యాపింపచేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రోజు అశాంతి నెలకొనేందుకు ఆరెస్సెస్ విస్తృత ప్రచారం చేస్తోందన్నారు. దేశంలో 20 మందికి లాభం చేకూర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో అన్ని వర్గాలకు , ప్రతిపౌరుడికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాలను కలుపుకునిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మోదీ పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం నేర్చుకున్నారని, కాని హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మోదీ ఒక మాటల ప్రధాని అని ఆయన ఎద్దేవా చేశారు. గత 70 ఏళ్లలో దేశానికి చేకూరిన ప్రయోజనం ఏమీ లేదంటూ మహాత్మాగాందీ, పటేల్, నెహ్రూ, అంబేద్కర్‌ను అవమానించడం మోదీకి అలవాటైందన్నారు. అసహనం, ద్వేషాన్ని వ్యాపింపచేసే సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. తాను ఇటీవల పార్లమెంటులో ఆప్యాయతతోనే మోదీని అలింగనం చేసుకున్నానని, కాని ద్వేషంతో ఉన్నట్లు మోదీ ముఖం చూస్తే అర్థమవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలన్నారు. బ్రిటీష్ వారు సేవాదళ్‌ను నిషేధించారని, ఆరెస్సెస్ జోలికివెళ్లలేదన్నారు. దీనిని బట్టి ఎవరికి దేశమంటే నిజమైన ప్రేమ, భక్తి ఉందో అర్థమవుతుందన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ దేశం కోసం ఏళ్లతరబడి జైళ్లలో మగ్గారని, కాని క్షమాపణ చెప్పలేదన్నారు. కాని వీడీ సావర్కర్ బతుకు భయంతో తొమ్మిది సార్లు బ్రిటీష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు, నేతలకు టిక్కెట్లకేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం అజ్మీర్‌లో జరిగిన సేవాదళ్ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ