జాతీయ వార్తలు

పోఖ్రాన్‌లో నేడు వైమానిక దళ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైసల్మేర్, ఫిబ్రవరి 15: భారత్-పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత వైమానిక దళం శనివారం విన్యాసాలను ప్రదర్శించనుంది. వైమానిక దళ శక్తిసామర్థ్యాలు, తన పోరాట పటిమను వెల్లడించే వాయిశక్తి-2019 కార్యక్రమంలో భాగంగా ఆకాశ్ క్షిపణి పరీక్ష, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) నుంచి గన్ ఫైరింగ్, మిగ్ 29 విమానాలు గగన తలం నుంచి భూమి మీదకు దాడులు చేయడం వంటి అంశాలను మొదటిసారిగా ఇందులో ప్రదర్శించనున్నారు. భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధునాతనంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆకాశ్, ఆస్ట్రా తదితర వాటిని ప్రదర్శిస్తారు. లక్ష్యాలను గుర్తించడం, స్విఫ్ట్ ఐడెంటిఫికేషన్, న్యూట్రలైజింగ్ టార్గెట్ తదితర అంశాలను ఇంచుమించు 1.55 గంటల పాటు ప్రదర్శిస్తారు. మిగ్ 29, జాగ్వార్, సుఖోయ్, మిరేజ్-2000 లాంటి యుద్ధ విమానాలు, రవాణాకు ఉపయోంచే ఏఎన్-32, సీ 130, ఎంఐ-17, ఎంఐ-35 హెలికాప్టర్లను శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ మేరకు గురువారం పూర్తి స్థాయిలో రిహార్సల్స్ చేశామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సోంబిత్ ఘోష్ తెలిపారు.వాయుదళం శక్తిసామర్థ్యాలను వెల్లడించే ఈ ప్రదర్శన మూడేళ్లకొకసారి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఫైటర్స్, హెలికాప్టర్లు, ఇతర సాంకేతిక పరికరాలను ప్రదర్శిస్తామన్నారు.