జాతీయ వార్తలు

ప్రతీకారం తీర్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో గురువారం జరిగిన పాక్ మిలిటెంట్లు జరిపిన ఉగ్ర ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని సీఆర్‌పీఎఫ్ హెచ్చరించింది. సీఆర్‌పీఎఫ్ దళాలపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో శుక్రవారం నాటికి 40 మంది జవాన్లు అసువులు బాశారు. ‘ఉగ్ర దాడిని మరిచిపోం. వారిని వదిలిపెట్టం. ప్రతీకారం తీర్చుకుంటా. పుల్వామా ఘటనలో మరణించిన అమర జవాన్లకు శెల్యూట్ చేస్తున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ’ అని దేశంలోని పారామిలిటరీ దళాల్లో అతిపెద్దదైన సీఆర్‌పీఎఫ్ తరఫున అధికార వర్గాలు ట్వీట్ ద్వారా తమ ప్రతిస్పందనను తెలియజేశాయి.
ఈ సందర్భంగా వీర జవాన్ల అకాల మృతికి సీఆర్‌పీఎఫ్ పోలీస్ ఫోర్స్ రెండు నిమిషాలపాటు వౌనం పాటించారు. కాగా, పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.