జాతీయ వార్తలు

పాకిస్తాన్‌కు మరో ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఆర్థికంగా మరింత తీవ్ర చర్యలు చేపట్టింది. అత్యంత ప్రాధాన్య దేశం (ఎమ్‌ఎఫ్‌ఎన్) హోదా నుంచి పాక్‌ను తప్పించిన భారత్ ఆ దేశం నుంచి ఇక్కడికి జరిగే దిగుమతులపై సుంకాన్ని 200శాతం పెంచింది. ఫలాలు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ఖనిజాలు సహా పాక్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపైనా ఇకనుంచి 200శాతం సుంకం వర్తిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి ఎగుమతయ్యే వస్తువుల విలువ రూ.3,482.3 కోట్ల మేర ఉంది. తాజా నిర్ణయంతో భారత్‌కు పాక్ ఎగుమతులు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉంది. సుంకం పెంపు నిర్ణయం తక్షణ ప్రాతిపదికన అమలవుతుందని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. భారత్ తాజా నిర్ణయంతో ఇక పాక్ వస్తువుల దిగుమతికి ఆస్కారమే ఉండదని, దాదాపుగా వాటిని రద్దు చేసినట్టేనని అధికార వర్గాలు తెలిపాయి.