జాతీయ వార్తలు

తమిళుల విద్వేషమే అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: తమిళ భాషకు కాకుండా వేరే ఏ ఇతర భాషలకూ ప్రాచీన హోదా ఇవ్వరాదు. తమిళభాషే అత్యంత ప్రాచీనమైంది. దీన్ని మించిన భాష మరొకటి దేశంలో లేదు. ఉండదు. తమిళంతో సరిసమానంగా వేరే భాషలకు ప్రాచీన హోదా కట్టబెడితే, తమిళానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోదూ.. అందుకే ఏ ఇతర భాషకూ ఎలాంటి హోదా ఇవ్వటానికి వీల్లేదన్న ఓ సగటు తమిళ దురభిమానికి మద్రాసు హైకోర్టు సోమవారం గట్టిగా బుద్ధి చెప్పింది. తెలుగుతో సహా ఇతర భాషలను దాయాది భాషలుగా పరిగణించి వాటిని ఎదగకుండా చేసిన కుట్రను న్యాయస్థానం భగ్నం చేసింది. ప్రాచీన హోదాపై తెలుగు, మలయాళ, కన్నడ, ఒరియాలకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని విస్పష్టంగా తేల్చిచెప్పింది. దీనిపై 2008 నుంచి మద్రాసు హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సోమవారం తీర్పు ఇచ్చిన సందర్భంగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రసిద్ధ ఓలివర్ వెండెల్‌హోమ్స్ కొటేషన్‌ను ప్రముఖంగా ప్రస్తావించటం గమనార్హం.
‘‘ప్రతి భాష ఒక దేవాలయం వంటిది. అందులో ఆ భాషను మాట్లాడేవారి ఆత్మ ప్రతిష్ఠితమై ఉంటుంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తెలుగుతో పాటు ఇతర భాషలకు ప్రాచీన హోదా ఇవ్వటంపై తమిళులు పెట్టిన తిరకాసు పరిణామం వివరాలు..
* 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం తెలుగు, కన్నడ, మలయాళ, ఒరియా భాషలకు ప్రాచీన హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీనియర్ న్యాయవాది ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు.
* తమిళం కాకుండా ఇతర భాషలకు ప్రాచీన హోదా ఇస్తే తమ భాషకున్న ప్రాధాన్యం తగ్గిపోతుందని వాదన చేశారు.
* ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ 2008లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రాచీన హోదా సాధించటానికి ఉన్న అర్హతలకు సంబంధించిన వివరాలతో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. వాటిలో తెలుగు ప్రాచీన చరిత్ర వివరాలను పొందుపరిచింది.
* 11వ శతాబ్దంలో జీవించిన నన్నయ్య భట్టారకుడు శ్రీమదాంధ్రమహాభారతం రచించాడు. ఈ విధంగా తెలుగు సాహిత్య చరిత్ర వయసు 900సంవత్సరాలు మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కాదు. పైనా నన్నయ్య భారతం అనువాదం మాత్రమే. 70శాతం పదాలు సంస్కృత సంబంధమైనవే ఉన్నాయి. దీన్ని సాకుగా తీసుకుని పిటిషనర్ వాదనలు వినిపించారు.
* 2015 ఏప్రిల్ లో తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ చొరవ తీసుకుని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సప్లిమెంటరీ నోట్‌లను తయారు చేసి తరువాతి స్థాయికి కేసును ముందుకు తీసుకెళ్లారు.
* ఈ కౌంటర్ అఫిడవిట్ ప్రకారం తెలుగు సాహిత్యం వెయ్యేళ్ల కంటే ప్రాచీనమైంది. 9వ శతాబ్దంలోనే పంపన ఆదిపురాణం, విక్రమార్జున విజయం రచనలు వచ్చాయి. పంపన రచనలు నిజమైనవిగా నిరూపితమైనవి.
* కరీంనగర్ జిల్లా కోటి లింగాలలో శాతవాహనుల కాలం నాటి శాసనాలు నాణాలు లభించాయి. వివి కృష్ణశాస్ర్తీ వీటిని 2, 3 శతాబ్దాలకు చెందినవిగా ధ్రువీకరించారు. ఇక్కడి శోడష మహాజనపదాలు క్రీస్తుపూర్వ 6వశతాబ్దానికి చెందినవవని తేలింది. ఈ దృష్ట్యా తెలుగు వారి నాగరికత 1500సంవత్సరాలకు పూర్వమైంది.
* ఈ అఫిడవిట్ ఆధారంగా తమిళనాడు న్యాయవాది వేసిన పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా మద్రాసు హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

ఇక భాషాభివృద్ధికి కృషి
తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయటం సంతోషకరమని మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాషను ప్రపంచ భాషగా చేయటంలో రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని, ఇకనైనా ఉదాసీనంగా ఉండటం తగదని ఆయన అన్నారు.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్,
మాజీ ఎంపి

తెలుగు భాషా పీఠాన్ని ఆంధ్రకు తెస్తాం
తెలుగు భాషా పీఠాన్ని మైసూరు నుండి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తాం. తెలుగుకు ప్రాచీన భాషా హోదా వల్ల ఏడాదికి వంద కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా వద్దని దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం హర్షదాయకం
- పల్లె రఘునాథరెడ్డి
ఏపి మంత్రి

తీర్పు హర్షదాయకం
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడం సబబేనని హైకోర్టు స్పష్టం చేయడం హర్షదాయకం. రాష్ట్రప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు, అధికారిక ప్రకటనలు ఇకపై అన్నీ తెలుగులోనే జరపాలి.
- కె.రామకృష్ణ
సిపిఐ ఏపి రాష్ట్ర కార్యదర్శి

చిత్రాలు.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి