జాతీయ వార్తలు

ఉగ్రవాదం అణచివేతకు పూర్తి మద్దతునిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పుల్వామా దాడి అనంతరం కేంద్రం చేపట్టిన చర్యలను ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ వివరించారని తెలిపారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉగ్రవాదుల అణిచివేతకోసం భద్రతా బలగాలకు మేం అండగా ఉంటామని అన్ని పార్టీలు కేంద్రానికి స్పష్టం చేశాయని పేర్కొన్నారు. మృతుల భౌతికకాయాలు, ఘటన తర్వాత అక్కడి పరిస్థితులు చిత్రాలను అన్ని పార్టీల నాయకులకు చూపించారని తెలిపారు. ఆ దృశ్యాలను చూసి అన్ని పార్టీల నేతలు చలించిపోయారని ఆయన అన్నారు.