జాతీయ వార్తలు

భారత్ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, ఫిబ్రవరి 16: మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ స్టేటస్ నుంచి తమ దేశాన్ని ఉపసంహరించడంపై పాకిస్తాన్ మండిపడింది. అంతేకాకుండా దీనిపై సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. ఇదే తరుణంలో మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్‌లో చోటు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నామని స్పష్టం చేసింది. కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై పాక్ ముష్కరులు భీకర దాడి చేసి 44 మంది సైనికులను బలితీసుకున్న నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పెషల్ ట్రేడ్ స్టేటస్ నుంచి పాకిస్తాన్‌ను తప్పిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాణిజ్య సలహాదారు రజాక్ దావూద్ మాట్లాడుతూ ‘్భరత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై లేదా తమకు సౌత్ ఆసియా ప్రిఫెరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (సాప్టా)లో రాయితీలను పునరుద్ధరించేందుకు వీలుగా జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. గురువారం జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్ ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అసువులు బాశారు. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినందున భారత్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ స్టేటస్ నుంచి పాకిస్తాన్‌ను తప్పిస్తూ అసాధరణ నిర్ణయం తీసుకుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్‌లో పాకిస్తాన్‌కు 1995లో చోటు కల్పించిన భారత్ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తొలిసారిగా ఆ దేశాన్ని తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2106లో జమ్మూ-కాశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాదులు దాడులు జరిపిన సమయంలో కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ నుంచి పాకిస్తాన్‌ను తప్పించలేదు. అలాంటపుడు ఇపుడు తీసుకున్న తాజా నిర్ణయంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్‌లో మళ్లీ చోటు కోసం తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నట్టు చెబుతోంది.