జాతీయ వార్తలు

జమ్మూలో రెండోరోజూ కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఫిబ్రవరి 16: జమ్ములో వరుసగా రెండవ రోజు కూడా కర్ఫ్యూను విధించారు. పుల్వానా ఘటన సంభవించిన వెంటనే నగరంలో అల్లర్లు జరిగాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూను విధించారు. నగరంలో పోలీసు కవాతును నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను నియమించారు. జమ్మువిశ్వవిద్యాలయంలో ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలను వాయిదా వేశారు. జమ్ముకాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేయడంతో పెద్ద వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ విధించడం వల్ల ఎటువంటి అల్లర్లు జరగలేదని, సంఘ విద్రోహశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఐజీ వివేక్ గుప్తా చెప్పారు. డిప్యూటీ కమిషనర్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ, అధికారులు శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించారు. అవసరమైన మరిన్ని బలగాలను నియమిస్తున్నట్లు చెప్పారు. హెలికాప్టర్లు, యూఏవీలను కూడా రంగంలోకి దింపారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో జమ్ము అట్టుడుకింది. ఆందోళన కారులు రువ్విన రాళ్లదాడిలో తొమ్మిది మంది పోలీసులకు గాయాలయ్యాయి. అనేక వాహనాలను ఆందోళన కారులు తగలబెట్టారు. ఇది ఒక దురదృష్టమైన ఘటన అని జమ్ము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పేర్కొంది. జమ్ము రీజియన్‌లో హై స్పీడ్ మొబైల్ డాటాసర్వీసులను నిలిపివేశారు. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసులు యదాతథంగా పని చేస్తున్నాయి.