జాతీయ వార్తలు

వేర్పాటువాదులకు భద్రత ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆరుగురు వేర్పాటువాద నేతలకు ఇచ్చిన ప్రత్యేక భద్రతను ప్రభుత్వం ఆదివారం ఉపసంహరించుకుంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ వేర్పాటువాదులుగా ముద్రపడిన ఏ నేతకూ ఇకపై ప్రత్యేక భద్రతా సౌకర్యాలు ఉండబోవని స్పష్టం చేసింది. తాజాగా ప్రత్యేక భద్రతను కోల్పోయిన వారిలో మిర్వైజ్ ఉమర్ ఫరూక్‌తోబాటు అబ్దుల్ ఘనీ భట్, బిలాల్ లోనే, హషీమ్ ఖురేషీ, ఫైజల్ హక్ ఖురేషీ, షాబీర్ షా ఉన్నారు. ఈ నేతలకు భద్రత విషయంలో ఎలాంటి కేటగిరైజేషన్ లేదు. కొన్ని మిలిటెంట్ గ్రూపుల నుంచి హెచ్చరికలు అందుకున్న ఈ నాయకులకు ప్రాణహాని ఉందంటూ గతంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం వీరికి అడహాక్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. అంతకుముందు మిర్వైజ్ ఉమర్ తండ్రి మిర్వైజ్ ఫరూఖ్‌ను 1990లో హిజ్‌బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లు చంపేశారు. అలాగే 2002లో అబ్దుల్ ఘనీ లోనేను హతమార్చారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గీలానీ, జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యసీన్ మాలిక్‌లకు అప్పట్లో ప్రత్యేక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఆ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరుగురు వేర్పాటు వాదులకు కల్పిస్తున్న అన్ని రకాల భద్రతా సదుపాయాలు, వాహనాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఎవరైనా వేర్పాటువాదులు ఇలాంటి సదుపాయాలను అనుభవిస్తున్నారా అన్న విషయాన్ని పోలీసులు నిగ్గుదేలుస్తారని అధికారులు తెలిపారు. కాగా గత శుక్రవారం శ్రీనగర్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్, దాని అనుబంధ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు తీసుకుంటూ ఇక్కడ వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తున్న వారికి ఇస్తున్న సదుపాయాలపై సమీక్షిస్తామని పేర్కొన్నారు. జమ్ము-కాశ్మీర్‌లో కొంతమంది ఐఎస్‌ఐ, తీవ్రవాద సంస్థలతో అనుబంధంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.