జాతీయ వార్తలు

ఇంజనీర్ల బుద్ధికుశలతను అవమానిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఎద్దేవా చేయడం ద్వారా భారతదేశ మేధోసంపత్తిని, కఠోర పరిశ్రమను అవమానించారని ఆయన పేర్కొన్నారు. సెమీ-హై స్పీడ్ రైలు ప్రారంభ కార్యక్రమంలో శనివారం ఉదయం సమస్య తలెత్తి, ఆ రైలు ముందుకు వెళ్లలేక పోవడంతో ‘మోదీ జీ, మేక్ ఇన్ ఇండియాపై లోతుగా పునరాలోచించవలసిన అవసరం ఉంది. అనేక మంది ప్రజలు ఆ కార్యక్రమం విఫలమయిందని భావిస్తున్నారు. అది ఎలా పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము తీవ్రంగా ఆలోచిస్తున్నామని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీనిపై వేగంగా స్పందించిన మంత్రి గోయల్ ‘్భరతీయులయిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కార్మికుల బుద్ధి కుశలత, కఠోర శ్రమపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్య’ అని ఆదివారం ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఆలోచనా విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని ఆయన రాహుల్‌కు హితవు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా అనేది విజయవంతమయిన కార్యక్రమం. కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో భాగమయి పోయింది. మీ కుటుంబానికి ఆలోచించడానికి ఆరు దశాబ్దాలు పట్టింది, అదిసరిపోదా?’ అని గోయల్ రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు.