జాతీయ వార్తలు

జవాన్ల త్యాగాలు వృథా కాబోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఖింపూర్ (అస్సాం), ఫిబ్రవరి 17: కేంద్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్నందున పుల్వామాలో జరిగిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలు వృథా కాబోవని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా బీజేపీ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలలో ఎలాంటి రాజీ ధోరణిని కనబరచదని ఆయన పేర్కొన్నారు. పార్టీ యువజన విభాగం బీజేవైఎం ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై హేయమయిన దాడికి పాల్పడిన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని అన్నారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. జవాన్ల త్యాగాలు వృథా కాబోవు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. భద్రతకు సంబంధించిన ఏ అంశంపైనా మేము రాజీ పడబోము’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రపంచంలోని అందరు ప్రపంచ నాయకుల్లో అత్యంత ఎక్కువ సంకల్ప బలం ఉన్న నేత నరేంద్ర మోదీ అని ఆయన పేర్కొన్నారు. ‘ఇదివరకే పాకిస్తాన్‌కు దౌత్యమార్గాలు, బుల్లెట్లు, లక్ష్యిత దాడుల ద్వారా సమాధానం ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అన్ని రకాల సమాధానాలు ఇచ్చింది’ అని అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఒక ఉగ్రవాది గురువారం పుల్వామాలో చేసిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చిత్రం.. ర్యాలీలో మాట్లాడుతున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా