జాతీయ వార్తలు

కాలుష్యానికిదే విరుగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనిపట్, ఫిబ్రవరి 17: వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు కోయగా మిగిలిన దుబ్బును నిర్వహించడంలో నూతన పద్ధతులు అనుసరిస్తున్న హర్యానా రైతులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. ఆ రైతుల్లో కొందరిని ఆయన ‘కిసాన్ రత్న’, ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించారు. అనేక రాష్ట్రాలలో రైతులు పంటలు కోయగా మిగిలిన దుబ్బును తగలబెడుతుండటం గత కొనే్నళ్లుగా వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా పరిణమించింది. దీంతో ప్రభుత్వాలు దుబ్బును తగులబెట్టడాన్ని నిషేధించాయి. ఇందుకోసం కొత్త పద్ధతులను అనుసరించడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. హర్యానా ప్రభుత్వం సోనిపట్‌లోని గనౌర్‌లో ఆదివారం నిర్వహించిన నాలుగో వ్యవసాయ నాయకత్వ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమయిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. ‘మూడు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మన వీర జవాన్లలో కొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రతి భారతీయుడితో పాటు నేను ఈ హేయమయిన దాడిని ఖండిస్తున్నాను. అమరవీరులయిన జవాన్ల కుటుంబాలతో పాటు మొత్తం దేశం దుఃఖిస్తోంది. మన వీర సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన, చేస్తున్న సేవలను నేను స్మరించుకుంటున్నాను’ అని రాష్టప్రతి అన్నారు. రాష్ట్రపతి ఈ సందర్భంగా కొంత మంది రైతులను ‘కిసాన్ రత్న’, ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించారు. రైతులు, హర్యానా ప్రభుత్వం కలిసి వ్యాపార సరళతను పెంపొందించడం, బాల,బాలికల జనాభా నిష్పత్తి వంటి సామాజిక సూచికలను మెరుగుపరచడం సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అధునాతన, 21వ శతాబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం ఈ ప్రక్రియలో భాగం. ఇలాంటి సహకారం వల్ల రైతులు లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు. హర్యానాలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో పంటలు కోసిన తరువాత మిగిలిపోయిన దుబ్బును నిర్వహించడంలో కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని రాష్టప్రతి అభినందించారు. పంటలు కోయగా మిగిలిన దుబ్బును దగ్ధం చేయడం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్య సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో రైతులు సహకరిస్తారన్న విశ్వాసాన్ని రాష్టప్రతి వ్యక్తం చేశారు.
చిత్రం.. హర్యానాలోని సోనీపేటలో వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా
ఓ ప్రదర్శనను తిలకిస్తున్న రాష్ట్రపతి కోవింద్, రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్